Saturday 25 July 2015

Rayalaseema - రాయలసీమ గురించి వ్యాసాలు

రాయలసీమ గురించి వ్యాసాలు (About Rayalaseema)


చరిత్రలో రాయలసీమ - భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి (భూమన్)
ఇదిగో రాయలసీమ గడ్డ - డా.సి.నారాయణరెడ్డి 
సీమ వెనకబాటుతనంపై శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన ఒక పత్రం - బి.పాండురంగారెడ్డి

మరి కొన్ని వ్యాసాల కొరకు : http://rayalaseema.npage.de

Tuesday 14 July 2015

Rayalaseema - Anathapur History - అనంతపురం జిల్లా చరిత్ర

Anathapur History - అనంతపురం జిల్లా చరిత్ర


రాష్ట్రంలో వైశాల్యములో అతి పెద్ద జిల్లా, తెలుగు అక్షర క్రమములో మొదటిది. అనంతపురం దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు చెందిన అతి పెద్ద జిల్లా మరియు ముఖ్య పట్టణము. అనంతపురం జిల్లా 1882లో బళ్లారి జిల్లా నుండి వేర్పాటు చేయబడినది. ఈ ప్రాంతము ప్రధానముగా వర్షాధారిత వ్యవసాయము. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిర్చి, నువ్వులు మరియు చెరుకు. పట్టు, సున్నపురాయి, ఇనుము, మరియు వజ్రాల త్రవ్వకము ముఖ్యమైన పరిశ్రమలు. స్వాతంత్రం వచ్చిన రోజులలో నిర్మించిన గడియారగోపురం నగరం మధ్యలో ఉండి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటుంది.
For more information click: http://rayalaseema.npage.de/-(6).html

Rayalaseema - Kurnool History - కర్నూలు జిల్లా చరిత్ర

Kurnool History - కర్నూలు జిల్లా చరిత్ర


కర్నూలు దక్షిణ భారతదేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నగరము మరియు అదే పేరుగల జిల్లా యొక్క ముఖ్య పట్టణం. ఒకప్పుడు కందెనవోలు గా ప్రసిద్ధి చెందిన పట్టణం ఇప్పుడు కర్నూలుగా మారింది. 1953 అక్టోబరు 1 నుండి 1956 అక్టోబరు 31 వరకు ఆంధ్రరాష్ట్ర రాజధాని గా కొనసాగింది. జిల్లాలో ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన, ప్రపంచంలోకెల్లా పెద్దదైన, వన్యమృగ సంరక్షణ కేంద్రం (శ్రీశైలం - నాగార్జునసాగర్) ఉంది. ఎప్పుడో అంతరించి పోయిందని భావించబడిన బట్టమేక పిట్ట ఇటీవల జిల్లాలోని రోళ్ళపాడు వద్ద కనిపించడంతో ఆ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించారు. అక్టోబరు 2, 2009న భారీ వర్షాలు మరియు హంద్రీ, తుంగభద్ర నదుల వరద నీటివల్ల కర్నూలు పట్టణంలో వందల ఇళ్ళు మునిగిపోయి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మధ్వాచార్యులు అయిన రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం మంత్రాలయం కర్నూలు జిల్లాలోదే. 
For More information click: 

Rayalaseema History - రాయలసీమ చరిత్ర

Rayalaseema History రాయలసీమ చరిత్ర

రాయలసీమ అనునది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ముఖ్యప్రాంతాల్లో ఒకటి . ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ భాగం లో ఉండే నాలుగు జిల్లాలు ( కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి. రాయలసీమ విజయనగర సామ్రాజ్యం లో భాగాంగా శ్రీ కృష్ణదేవ రాయలచే పరిపాలించబడినది. అది వరకూ తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా హిరణ్యక రాష్ట్రంగా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై చోళుల ప్రభావం పెరిగినది. బ్రిటీషు వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన హైదరాబాదుకి చెందిన నిజాం సుల్తానులు 1802 లో ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దీనికి దత్త మండలం అని పేరు వచ్చినది. 1808 లో దత్త మండలం ను విభజించి బళ్ళారి మరియు కడప జిల్లాలని ఏర్పరచారు. 1882 లో అనంతపురాన్ని బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి 1928లో చిలుకూరి నారాయణరావు "రాయలసీమ" అని పేరుపెట్టాడు. అప్పటి నుండి ఆ పేరే స్థిరపడినది.
For more information click: 

Rayalaseema Demands - రాయలసీమ డిమాండ్లు

Rayalaseema Demands - రాయలసీమ డిమాండ్లు


రాయలసీమ డిమాండ్లు :
  • ప్రత్యేక రాయలసీమ సాధన.
  • రాయలసీమలోని 4 జిల్లాలను 8 చేయాలి.
  • రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలి.
  • కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. 
  • వైద్య రంగం అభివృద్ధి.
  • రాయలసీమలో ఎర్రచందనం విక్రయించడం ద్వారా వచ్చే డబ్బును ఇక్కడే ఖర్చు పెట్టాలి.
సాగునీరు :
  • కృష్ణానది మిగులు జలాలన్నీ రాయలసీమకే కేటాయించాలి.
  • శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు కృష్ణా జలాలు పంపిణీ చేయాలి.
  • జనాభా ప్రాతిపదికన సీమకు నీటి కేటాయింపులు జరగాలి.
  • పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి.
  • జిల్లాలో హంద్రీ నీవా కాలవ పనులు పూర్తిచేసేందుకు తక్షణం రూ. 1500 కోట్లు కేటాయించాలి.
  • కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపాలి.
  • వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి కొనడానికి తగిన వసతిసౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
ఉపాధి :
  • ఉపాధి కల్పన కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
  • ప్రత్యేక రాయలసీమ అభివృద్ది మండలి ఏర్పాటు చేసి రాయలసీమ అభివృద్దికి కృషిచేయాలి.
  • శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుల మేరకు రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి.
  • రాయలసీమ సమగ్రాభివృద్ధికి లక్షకోట్ల ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలి.
  • రాయలసీమలో టూరిజం సెంటర్లను ఏర్పాటు చేయాలి.
  • కడపలో ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేయాలి.
  • రాయలసీమ లో గ్యాసు పైపులైనుని వేయించాలి.
ఉద్యోగాలు :
  • ఉద్యోగాలలో సమానత్వాన్ని పాటించాలి
  • రాయలసీమలో ఉన్నత విద్యాసంస్థలనుపరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధికల్పించాలి.
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీబయోటెక్నాలజీ మరియు ఇతర వృత్తి విద్యా కోర్సులను అందజేస్తున్న విద్యాసంస్థలకి ప్రత్యేక రాయితీలని ప్రకటించాలి.
  • విద్యా సంస్థలను నెలకొల్పి, జాతీయ స్థాయిలో వాటికి ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలి.

Rayalaseema - నేను ఉన్నాను అని రా! కదలిరా!

http://rayalaseema.npage.de

రాయలసీమకు వున్న చరిత్ర గురించి ఘణంగా చెప్పుకొవడమెనా! లేక జరుగుతున్న అన్యాయాన్ని అడిగె వారు ఉన్నారా?
ఉంటె రండి అడుగుదాం! అడిగి కడుగుదాం!!
భూమి కొసం, భుక్తి కొసం, నీటి కొసం, మన హక్కు కొసం, నీ హక్కు కొసం రా! కదలిరా !
నేను ఉన్నాను అని రా! కదలిరా !

Rayalaseema - మన రాయలసీమ - Home page new look

Mana Rayalaseema

http://rayalaseema.npage.de

నవ్యాంధ్రప్రదేశ్లో రాయలసీమ బౌతిక చిత్రం ఇదిప్రత్యేక రాయలసీమాకోస్తాంధ్రతో కలిసి ఉండటమానీళ్ళు ముఖ్యమారాజధాని ముఖ్యమారాయలసీమఉద్యమమాఅనంత సాగునీటి సమస్యానీళ్లు సాధించుకున్న తరువాత ప్రత్యేక రాయలసీమాప్రత్యేక రాయలసీమను సాధించుకున్న తరువాత నీళ్ళాయధాతథరాయలసీమాసామాజిన రాయలసీమానిన్న ఉన్న ఐడియాలజీలూభావనలూ నేడు ఉండక పోవచ్చునేడు ఉన్న ఐడియాలజీలూభావనలూ రేపటికిమారిపోవచ్చుకాబట్టి భిన్న ఆలోచనల ప్రాతిపదికగా మేధావులు విడిపోవడం కంటేరాయలసీమ ప్రయోజనాలు అనే మౌలిక అంశం పట్ల తమ భిన్నమైనఆలోచన్లనతోనే కలిసి పని చేయడం శ్రేయస్కరంసందర్భంలోనే,రాయలసీమ రచయితలూమేధావులూ, రాజకీయ నాయకులు ఒక ప్రజాస్వామిక వేదిక మీదఐక్య సంఘటనగా మారవలసి ఉన్నదిరాజకీయ పార్టీలకు అతీతంగా రాయలసీమ ప్రజలు వేదిక రూపం తీసుకోవలసి ఉన్నది. కళలూ, సంస్కృతీ, చరిత్రా, భౌగోళిక వాస్తవికతలకు సంబంధించిన రాయలసీమ పునరుజ్జీవనానికి ఏకం అవుదాం.

For more information click: 

http://rayalaseema.npage.de